మంచిర్యాల: అక్షరతెలంగాణ :
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో ఈరోజు జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈనెల 17వ తారీకు నుండి 30 వ తారీఖు వరకు జాతీయ కుష్టు వ్యాధి పైన సర్వే కార్యక్రమం లు చేపట్టడం జరుగుతుంది. కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమంలో భాగంగా ఈరోజు జిల్లాలోని వైద్యాధికారులు సుప్రవైజర్లు ప్రోగ్రామ్ ఆఫీసర్లతో అవగాహన సమీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగినది జిల్లాలో 149 ఆరోగ్య ఉపకేంద్రములు 650 ఆశా కార్యకర్తల ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో చేపట్టవలసిన ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగినది కుష్టు వ్యాధి మైకో బ్యాక్టీరియం లిప్రే అని బ్యాక్టీరియా వల్ల వచ్చు వ్యాధి ఇది చర్మానికి నరాలకు సోకుతుంది కుష్టు వ్యాధి చాలా నెమ్మదిగా పెరిగి వ్యాధి లక్షణం బయటకు తెలియడానికి సుమారు మూడు సంవత్సరముల నుండి ఐదు సంవత్సరంల వరకు పడుతుంది. కుష్టు వ్యాధి ఎవరికైనా రావచ్చును దీనికి వయసు లింగభీదం లేదు కుష్టు వ్యాధి వంశపారేపర్యం కాదు కుష్టు వ్యాధి బౌలా ఔషధ చికిత్సతో ఆరు నెలల నుండి 12 నెలల లోపల పూర్తిగా నయమవుతుంది ఈ రోగులు పూర్తి సామాజిక జీవితం గడపవచ్చును ప్రారంభ దశలో గుర్తించి ఎండిటి చికిత్స ఇచ్చినచో కుష్టు వ్యాధి అంగవైకల్యానికి దారి తీయదు అంగవైకల్యానికి చికిత్సలు చేసుకొనవచ్చును కావున ప్రజలకు తెలియజేయునది ఏమనగా చర్మం పైన ఏ రకమైన మచ్చలు ఉన్నా మీ ఇంటికి వచ్చే ఆరోగ్య కార్యకర్తలు గాని ఆరోగ్య కేంద్రం గానీ డాక్టర్ను సంప్రదించవలెనని కోరడమైనది ఈ వ్యాధి లక్షణాలు సహజ చర్మపు రంగు కంటే తక్కువ లేదా రాగి రంగు కలిగి ఉంటాయి మచ్చపై స్పర్శ ఉండదు మరియు ఇది శరీరంలో ఏ ప్రదేశంలోనైనా రావచ్చును నరాలకు వ్యాధి సోకినచో కాళ్లు లేక చేతులలో తిమ్మిర్లు బలహీనత స్పర్శ కోల్పోవుట మొదలగు లక్షణములు కనిపిస్తాయి కావున మనమందరము కుష్టు వ్యాధి పట్ల ఉన్న భయాన్ని విడనాడాలి, కుష్టురహిత సమాజాన్ని సాధిద్దాం అందుకోసమని రోజులపాటు జరిగే సర్వే కార్యక్రమంలో వచ్చే ఆరోగ్య కార్యకర్తలను సంప్రదించండి మరియు వైద్యాధికారులు ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు అందరూ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజు గారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సుధాకర్ నాయక్ ఉపవైద్యాధికారి డాక్టర్ ఏ ప్రసాద్ డాక్టర్ అనిల్ కుమార్ డాక్టర్ కృపాబాయి మరియు వైద్యులు వైద్య సిబ్బంది సి హెచ్ ఓ వెంకటేశ్వర్లు డిపిఆర్ఓ రాఘవయ్య డిడిఎం ప్రవళిక బుక్క వెంకటేశ్వర్ జిల్లా మాస్ మీడియా అధికారి మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో సిబ్బందికి వైద్యులకు అవగాహన కార్యక్రమాల కోసం పోస్టర్లు పాంప్లెన్స్ ఫ్లెక్సీలు ఇవ్వడం జరిగినది సర్వే కార్యక్రమం కోసం ఫార్మేట్లు ఇవ్వడం జరిగినది ఈ సర్వే కార్యక్రమంలో వైద్యులు వైద్య సిబ్బంది అందరూ పాల్గొనాలని ఆదేశించినారు
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలోని సబ్ యూనిట్ అధికారులు నాందేవ్ జగదీష్ కాంతారావు ఎస్ఓ పద్మా డీపీ చంద్ పాల్గొన్నారు
Comments