భారతదేశం వైపు ప్రపంచమంతా చూస్తున్నది - ఎమ్మెల్యే పాయల్ శంకర్.

Madupa Santhosh CEO
భారతదేశం వైపు ప్రపంచమంతా చూస్తున్నది - ఎమ్మెల్యే పాయల్ శంకర్.
Adilabad: అక్షరతెలంగాణ : 
హిందువుల  పండగలపై ప్రపంచమంతా చర్చ జరుగుతుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు.
 ఆదిలాబాద్ తాటిగూడ లో నూతన రామాలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సనాతన ధర్మంపై రీసెర్చ్ జరుగుతుందన్నారు. సనాతన ధర్మంలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టమన్నారు. కావున ప్రతి ఒక్కరూ ఐక్యతగా ఉండాలని పేర్కొన్నారు. కలిసికట్టుగా ఆలయ నిర్మాణం చేసుకున్న కాలనీవాసులకు అభినందనలు తెలిపారు .
బోరజ్ జైనథ్ మండలాల్లో కార్యక్రమాలు
 బోరాజ్  మండలం .. జైనథ్ మండలం సాంగి గ్రామంలో లో నూతన రామాలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అంతకుముందు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సనాతన ధర్మంపై రీసెర్చ్ జరుగుతుందన్నారు. సనాతన ధర్మంలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టమన్నారు. కావున ప్రతి ఒక్కరూ ఐక్యతగా ఉండాలని పేర్కొన్నారు. కలిసికట్టుగా ఆలయ నిర్మాణం చేసుకున్న కాలనీవాసులకు అభినందనలు తెలిపారు .
కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా గ్రామాలలో నెలకొన్న సమస్యలతో పాటు మౌలిక వసతులు కల్పనకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు పేర్కొన్నారు.జైనథ్ మండలం న్యూ సాంగి, ఓల్డ్ సాంగి లలో మండలంలోని 8 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో రహదారి నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఇటీవల ఎన్నికల కోడ్ రావడం కారణంగా అభివృద్ధి పనులు కొంత ఆలస్యం అయిందని పేర్కొన్నారు. గ్రామాల నుండి జిల్లా కేంద్రాలకు వెళ్లే రహదారుల అభివృద్ధికి తో పాటు, గ్రామాల నుండి వ్యవసాయ క్షేత్రాలకు రహదారులకు ఓ ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో నాయకులు కరుణాకర్ రెడ్డి అశోక్ రెడ్డి నగేష్ విశాల్ వెంకన్న వైభవ్ తదితరులున్నారు
Comments