విద్యార్ధులు ప్రశాంతంగా ఒత్తిడి లేకుండా పరీక్షలు వ్రాయాలి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా

Madupa Santhosh CEO
విద్యార్ధులు  ప్రశాంతంగా  ఒత్తిడి లేకుండా పరీక్షలు వ్రాయాలి: జిల్లా కలెక్టర్ రాజర్షి షా
అదిలాబాద్ : అక్షరతెలంగాణ : 
బంగారిగూడ మోడల్ స్కూల్  ను బుధవారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి మధ్యాహ్నం భోజనం నాణ్యత ప్రమాణాలు, మెనూ ప్రకారం ఈ రోజు చేస్తున్న వంట, స్టోరేజ్ , తదితర  పరిశీలించారు
మరో వారం రోజుల్లో జరగనున్న పదవ తరగతి  పరీక్షలకు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు వ్రాయాలని, 
విద్యార్ధులు మంచిగా చదువుతున్నారని పరీక్షలు బాగా వ్రాస్తారని, మంచి మార్కులు సాధిస్తారని భరోసా ఇచ్చారు. ప్రతీ తరగతి గదిని పరిశీలించి పదవ తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులతో మాట్లాడుతూ ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా చదువుకోవాలని, ప్రతీ రోజూ దినచర్యలో భాగంగా ఉదయం, సాయంత్రం రివ్యూ చేసుకోవాలనీ, ప్రత్యేక తరగతులకు హాజరై , వీక్ గా ఉన్న సబ్జెక్టుల పై దృష్టి సారించాలని ఆన్నారు.
ఏకధాటిగా చదవకూడదని, మధ్య మధ్యలో  గ్యాప్ ఇస్తూ చదవాలని ఆన్నారు.
విద్యార్ధులకు ప్రతీ అంశం పై క్షుణ్ణంగా వివరిస్తూ , అర్థమయ్యేలా బోధించి , అనంతరం     
విద్యార్ధుల సంఖ్యకు అనుగుణంగా తరగతి గదులు, ఇతర సదుపాయాలు అందుబాటులో ఉన్నాయా లేవా ఆరా తీశారు. కిచెన్, స్టోర్ రూం లను సందర్శించి, బియ్యం నిల్వలు, కూరగాయల నాణ్యతను, సరుకుల స్టాక్ ను పరిశీలించారు. వంట నూనె, పాలు, పండ్లు, కోడిగుడ్ల నాణ్యత పరిశీలించి, కాల పరిమితి ముగిసిన వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించవద్దని నిర్వాహకులకు సూచించారు. నాణ్యతా లేమితో కూడిన నాసిరకం బియ్యం, ఇతర ఏవైనా సరుకులు పాఠశాలకు కేటాయించబడిన సందర్భాల్లో మండల అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. పాఠశాల సముదాయాన్ని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆహార పదార్థాలు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని , మెనూ పట్టికను పరిశీలించి,  విద్యార్థులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని సూచించారు. 
వేసవి ని దృష్టిలో ఉంచుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆన్నారు.
ప్రిన్సిపాల్ రాజశేఖర్, డి ఎం హెచ్ వో, ఉపాద్యాయులు, ఆర్. బి ఎస్ కే టీమ్, తదితరులు పాల్గొన్నారు.
Comments