సందేహాల నివృత్తి కి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం లో కాల్ సెంటర్ ఏర్పాటు: జిల్లా కలెక్టర్ రాజర్షి షా.

Madupa Santhosh CEO
సందేహాల నివృత్తి కి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం లో కాల్ సెంటర్ ఏర్పాటు: జిల్లా కలెక్టర్ రాజర్షి షా.
LRS లే అవుట్ క్రమబద్ధీకరణ పై  సందేహాల నివృత్తి  కోసం   8309959444 మొబైల్ ఫోన్ నెంబర్ కు కాల్ చేయండి: జిల్లా పాలనాధికారి రాజర్షి షా.
అదిలాబాద్ : అక్షరతెలంగాణ 
అనుమతి  లేని లే అవుట్ క్రమబద్ధీకరణ (LRS) దరఖాస్తులను పరిష్కరించేందుకు జిల్లాలో ప్రత్యేక చర్యలు చేపట్టేందుకు  హెల్ప్ డెస్క్ (సహాయ కేంద్రాన్ని ) ఏర్పాటు చేసి దరఖాస్తుదారులకు  సహాయం చేసే దిశగా LRS దరఖాస్తుల సందేహాల నివృత్తి కి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం లో  కాల్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని శనివారం జిల్లా పాలనాధికారి రాజర్షి షా తెలిపారు.
ఈ సందర్భంగా LRS లే అవుట్ క్రమబద్ధీకరణ పై ఏమైన సందేహాలు ఉంటే 
కలెక్టరేట్ లో హెల్ప్ డెస్క్ ఎర్పాటు చేయడం జరిగిందని, మొబైల్ నెంబర్ : 8309959444 
కృష్ణ చైతన్య, మున్సిపల్  కార్యాలయ వార్డ్ ఆఫీసర్  కు కాల్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవాలని ఆన్నారు.
ఈ నెల మార్చి 31 లోగా క్రమబద్ధీకరణ రుసుము చెల్లించే వారికి 25 శాతం రిబేట్ వర్తిస్తుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని  జిల్లా కలెక్టర్ తెలిపారు.

Comments