ఇంటర్మిడియేట్ పరీక్ష లకు ఏర్పాట్లు పూర్తి: జిల్లా కలెక్టర్

Madupa Santhosh CEO
ఇంటర్మిడియేట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: జిల్లా కలెక్టర్
జగిత్యాల: అక్షరతెలంగాణ : 
 జగిత్యాల జిల్లాలో మార్చి 5 నుంచి 25వరకు ఇంటర్ పరీక్షల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని, విద్యార్థులకు ఎలాంటి  ఇబ్బందులూ లేకుండా సమకూర్చామని జగిత్యాల జిల్లా ఇంటర్ విద్యాధికారి నారయణ తెలిపారు. ఇంటర్ పరీక్షలు ఉ. 9.00 నుంచి మ.12.00 వరకు పరీక్షలు జరుగుతాయని, ఇంటర్ మొదటి సంవత్సరంలో 7073 మంది, రెండో సంవత్సరంలో 7377, మొత్తం 14450 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి సందేహాలున్నా టెలిమానస్ 14416కు ఫోన్ చేయాలన్నారు.
Comments