అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఆదివాసి అస్తిత్వ పోరు గర్జన సభ లో పాల్గోన్న : బోరంచు శ్రీకాంత్ రెడ్డి

Madupa Santhosh CEO
అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఆదివాసి అస్తిత్వ పోరు గర్జన సభలో పాల్గోన్న : బోరంచు శ్రీకాంత్ రెడ్డిఅదిలాబాద్ : అక్షరతెలంగాణ : 
 అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం మరియు ఆదివాసి అస్తిత్వ పోరు గర్జన సభ ఆదివాసీ మహిళా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంటు ఇంచార్జి ఆత్రం సుగుణక్క  తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి  పాల్గొనడం జరిగింది. పెద్ద ఎత్తున ఆదివాసీ మహిళలు హాజరైన ఈ సభలో ముందుగా  రాణి దుర్గావతి, సావిత్రి బాయి పూలే, చాకలి ఐలమ్మ, రమాబాయి అంబేద్కర్, గౌరి లంకేశ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి వారి సేవలను స్మరించుకున్నారు. 
అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో బోరంచు శ్రీకాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో పురోగమించాలని కోరుకుంటూ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు.మనందరి జీవితంలో ఓ అమ్మగా, అక్కగా, చెల్లిగా, భార్యగా, కూతురిగా గృహిణిగానే కాకుండా వ్యవసాయం మొదలుకొని దేశ సరిహద్దుల్లో రక్షణ వరకు, అంతరిక్ష ప్రయోగాలలో విజయాలను సాధించే వరకు మహిళలు పోషిస్తున్న పాత్ర గణనీయమైనదని అన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళల సాధికారితకు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ..  కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా అన్ని రంగాల్లో మహిళలను ప్రోత్సహిస్తూ మహిళ సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. అటు ఆదివాసీ మహిళల హక్కుల పరిరక్షణ, ఆర్థిక సాధికారత, విద్యా అవకాశాలు, స్వయం ఉపాధి వంటి వాటికి  ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. మహిళల సంరక్షణకు మహిళా పోలీస్‌స్టేషన్‌ లు , షీటీమ్స్‌, సఖి కేంద్రం వంటి ఎన్నో సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
 ఈ కార్యక్రమంలో రాష్ట్ర కో కన్వీనర్  గోడం గణేశ్,  ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి వెట్టి మనోజ్ ఆదివాసి మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గోడం రేణుక , ఆదివాసి మహిళా సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు ఉయికా ఇందిర,  డివిజన్ అధ్యక్షురాలు సోయం లలిత బాయి, ఉపాధ్యక్షులు ఆత్రం గణపతి,  వెడమ ముకుంద రావు, మావల మండల అధ్యక్షులు తోడసం ప్రకాష్,సంఘ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు లత, ఆదిలాబాద్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నాగరాజు,అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ సామ రూపెష్ రెడ్డి, జైనత్ మండలాధ్యక్షడు రాకేష్,టౌన్ యూత్ వైస్ ప్రెసిడెంట్ రంజిత్, ఫేరోజ్ ,తదితరులు ఉన్నారు.
Comments