గిరిజనుల ఇండ్లు కూల్చివేసిన.. ఆ ...అధికారులను శిక్షించండి : అత్రం భుజంగారావు

Madupa Santhosh CEO
గిరిజనుల ఇండ్లు కూల్చివేసిన.. ఆ ...అధికారులను శిక్షించండి : అత్రం భుజంగారావు
మంచిర్యాల : అక్షరతెలంగాణ : 
జన్నారం: జన్నారం మండలంలోని దేవునిగూడా గ్రామపంచాయతీ పరిధిలోని కొత్త గడ్డం గూడా గ్రామంలో ఉన్న గిరిజనుల ఇండ్లను కూల్చివేసిన, అటవీ శాఖ అధికారుల అరెస్టు చేసి శిక్షించాలని హెచ్ఆర్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అత్రం భుజంగారావు డిమాండ్ చేశారు. సోమవారం ఆ గిరిజన గ్రామానికి వెళ్లి, పరిస్థితులను పరిశీలించారు. సుమారు 150 మందిపై అటవీశాఖ అధికారులు దాడి చేయడం చట్ట ఉల్లంఘన అవుతుందన్నారు. గత 30 సంవత్సరాల నుంచి అక్కడే తమ ఇండ్లను వేసుకొని నివాసం ఉంటున్న వారిని అన్యాయంగా రాత్రి సమయంలో  జెసిబి, ట్రాక్టర్లతో కూలగొట్టడం  సరికాదన్నారు. 30 సంవత్సరాలలో లేని అటవీ ఆంక్షలు ఇప్పుడేలా వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి గుడిసెలను పూర్తిగా జెసిబి ట్రాక్టర్లతో తొలగించడంతో పాటు,వారిని అటవీశాఖ అధికారులు నానా బూతులు తిట్టడంతో అది జీర్నించుకోలేక అదే గూడానికి చెందిన రాథోడ్ బలిరాం  పురుగుల మందు తాగాడన్నారు. అతడు ఒక్కడే కాదు మీరంతా పురుగుల మందు తాగి చావండి అనడం అటవీశాఖ అధికారుల దౌర్జన్యానికి పరాకాష్ట అన్నారు. అటవీ శాఖ ఉన్నతాధికారులు,ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.ఆ గిరిజనులు పోలీస్ స్టేషన్లో అటవీ సిబ్బందిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం దారుణం అన్నారు..
నిజనిర్ధారణ బృందం లో పాల్గొన్నవారు .ఆత్రం.భుజంగరావు, రఘోతం రెడ్డి,HRF,జిల్లా,ప్ర. కార్యదర్శి.ఉ ఆ.అమృత్రావుదుర్గం .కార్యకర్తలు.మెడ మురళీ,బత్తుల ప్రకాష్,బాగ్యరావు, పెందోర్ రవి తదితరులు పాల్గొన్నారు.
Comments