ఏ సీ బి కి చిక్కిన మరో తిమింగలం: డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్.

Madupa Santhosh CEO
ఏ సీ బి కి చిక్కిన మరో తిమింగలం: డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్.
అదిలాబాద్ : అక్షర తెలంగాణ : 
 అదిలాబాద్ జిల్లా కేంద్ర కార్యాలయంలో ఏ సీ బి కి మరో అవినీతి తిమింగలం చిక్క్కింది . ఎడ్యుకేషనల్ మరియు వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్  కార్పొరేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జిన్నంవార్ శంకర్ రూ.50 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. జిల్లాలో మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ (బాలికలు) భవనం నిర్మాణం కోసం రూ.2 కోట్ల బిల్లు చేయాల్సి ఉంది. ఆ బిల్లు కోసం రెండు కోట్లలో తనకు 1%  శాతం  అనగా  2 లక్షల రూపాయలు  ఇవ్వాలని డిమాండ్ చేశాడు. కానీ ఫిర్యాదుదారుడి అభ్యర్థన మేరకు దానిని రూ. 1 లక్ష రూపాయలకు తగ్గించాడు. దీంతో అతను ఏసీబీని ఆశ్రయించాడు. ఆ లక్షలో మంగళవారం సాయంత్రం ఫిర్యాదు దారుడి తీసుకుంటుండగా ఏసీబీ పట్టుకున్నారు. 
ఏ ప్రభుత్వ ఉద్యోగి  అయినా సరే విది నిర్వహణకు  లోబడి పనిపుర్తి చేయాలి లేని పక్షంలో లంచం అడిగితే, చట్ట ప్రకారం చర్య తీసుకోవడానికి ప్రజలు 1064 ను ACB టోల్ ఫ్రీ నంబర్ నీ  సంప్రదించాలి. లేనిపక్షంలో నేరుగా కూడా కలువవచ్చు అని అధికారులు స్పష్టం చేశారు. (ఏ సీ బి )అధికారులను తెలంగాణ లో సోషల్ మీడియా , వాట్సాప్ ద్వారా కూడా సంప్రదించవచ్చు.. అని తెలిపారు. 2 కోట్ల రూపాయల బిల్లుకు రూ.50 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. అనంతరం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ను అరెస్టు చేసి కరీంనగర్‌లోని ఎస్పీఈ మరియు ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తున్నట్లు తెలిపారు.
Comments