ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ కరీంనగర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా బదిలీ, అఖిల్ మహాజన్ ఐపిఎస్ ఆదిలాబాద్ జిల్లా నూతన ఎస్పీగా పోస్టింగ్ కల్పించడం జరిగింది.
ఆదిలాబాద్ : అక్షరతెలంగాణ :
ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌష్ ఆలం కరీంనగర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా బదిలీ . రాష్ట్ర వ్యాప్తంగా 21 మంది ఐపీఎస్ ల బదిలీల్లో గత రెండేళ్లుగా ఆదిలాబాద్ జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న గౌస్ ఆలంను కరీంనగర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు శుక్రవారం జరిగిన ఐపీఎస్ బదిలీలలో భాగంగా సిరిసిల్ల జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న 2017 బ్యాచ్ కు చెందిన అఖిల్ మహాజన్ కు ఆదిలాబాద్ జిల్లా నూతన ఎస్పీగా పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆదిలాబాద్ జిల్లా ఎస్పీగా పనిచేసిన గౌస్ ఆలం జిల్లాలో తనదైన ముద్ర వేశారు. ఆదివాసీ గుడాల్లో ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తూనే సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహించి ఆదివాసులకు ఎంతగానో చేరువయ్యారు. అదే విధంగా జిల్లా పోలీసుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ హెల్త్ క్యాంపులు నిర్వహించి విధుల్లోని వారికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారు. బదిలీపై వస్తున్న నూతన ఎస్పీ శుక్రవారం లేదా శనివారం బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది.
Comments