కఠోర శ్రమ వల్ల ఉన్నత స్థాయి క్రీడల్లో రాణించవచ్చు - జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్.
అదిలాబాద్ : అక్షరతెలంగాణ :
- రాష్ట్రస్థాయి క్రీడల్లో పథకాలు సాధించిన పోలీసు సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ.
- ఒక బంగారు, ఒక కాంస్య, 8 రజత సాధించిన ఏడుగురు సిబ్బంది.
- భవిష్యత్తులో మరిన్ని పథకాలు సాధించే దిశగా కృషి చేయాలని సిబ్బందికి సూచన.
- శాలువాతో సత్కరించి, సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ.
- 8 అంశాలు 10 పథకాలు సాధించిన సిబ్బంది.
మూడవ రాష్ట్రస్థాయి పోలీసు క్రీడలు రెండు నెలల పాటు కరీంనగర్ నందు జరిగిన సందర్భంలో ఆదిలాబాద్ జిల్లా నుండి పాల్గొన్న పోలీసు సిబ్బందికి 8 రంగాలలో 10 పథకాలను సాధించి జిల్లా కీర్తిని పెంపొందించడం జరిగింది. ఈ పది పథకాలను ఏడుగురు సిబ్బంది సాధించడం హర్షనీయం.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గౌస్ ఆలం ఐపిఎస్ స్థానిక పోలీసు ముఖ్య కార్యాలయంలో సిబ్బందిని ఆహ్వానించి సాధించిన పథకాలను ప్రశంసా పత్రాలను అందజేసి శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నిరంతరంగా కఠోర శ్రమ వల్ల భవిష్యత్తులో మరిన్ని పథకాలను సాధించవచ్చు అని సిబ్బందికి తెలియజేశారు. 7 గురు సిబ్బంది సాధించిన పథకాలు పోటీ చేసిన అంశాల వివరాలు.
1) ఏ రూప - ఉమెన్ కానిస్టేబుల్ జైనథ్ పోలీస్ స్టేషన్ - యోగ లో- రాష్ట్రస్థాయిలో బంగారు పతకం.
2) పి మీర్ సింగ్ - కాంస్య పథకం - రెజ్లింగ్ - క్యూఆర్టి అదిలాబాద్.
3) కె ముఖేష్ కుమార్ - 2 రజత పథకాలు - కరాటే మరియు కుమటో - ఏ ఆర్ హెడ్ క్వార్టర్స్.
4) ఏ రుచిత - రజత పథకం - జావలిన్ త్రో - ఏ ఆర్ హెడ్ కోటర్స్.
5) పి మీర్ సింగ్ - రజత పథకం - వెయిట్ లిఫ్టింగ్ - క్యూఆర్టి అదిలాబాద్.
6) ఎండి నస్మోద్దీన్ - రజత పథకం - వెయిట్ లిఫ్టింగ్ - క్యూఆర్టి అదిలాబాద్.
7) పి పూజ - 2 రజత పథకాలు - 4 x 100 రిలే మరియు 200m పరుగు - ఏఆర్ హెడ్ కోటర్స్.
8) ఏం రోహిణి - రజత పథకం - 4 x 100 రిలే - ఏఆర్ హెడ్ కోటర్స్.
ఈ అంశాలలో ఏడుగురు సిబ్బంది 10 పథకాలను సాధించడం జరిగింది. సిబ్బంది అందరూ ప్రతి రోజు వ్యాయామం చేస్తూ, వారు సాధించిన అంశాలలో మరింతగా శ్రమిస్తూ మరిన్ని ఉన్నత స్థాయి పథకాలను సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి వెంకటి, ఎన్ చంద్రశేఖర్, సీసీ దుర్గం శ్రీనివాస్, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారిని జైస్వాల్ కవిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments