యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక
బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ జరగనుంది. స్వస్తివాచనం, రక్షాబంధనం, అగ్ని ప్రతిష్ఠాపనతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. సాయంత్రం గరికపాటి నరసింహారావు ప్రవచన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆలయం లోపల, బయట కొండ చుట్టూ విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ భాస్కర్ రావు తెలిపారు.
Comments