చేతికొచ్చిన పంటను కాపాడడం ప్రభుత్వకర్తవ్యం..మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Madupa Santhosh CEO
చేతికొచ్చిన పంటను కాపాడడం  ప్రభుత్వకర్తవ్యం..మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 
ADILABAD : అక్షరతెలంగాణ :
ఎసంగి లో పండిన పంట : 
చేతికొచ్చిన పంటను కాపాడడం రాష్ట్ర ప్రభుత్వ కర్తవ్యమని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖా మంత్రి  ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. సాగునీటి విషయంలో అసత్య ప్రచారాలు ఎక్జువ అవుతున్నాయని, ఈ విషయంలో నీటిపారుదల శాఖాధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ వాస్తవాలను ప్రజలకు వివరించాలని సూచించారు. 
   సోమవారం సాయంత్రం డాక్టర్ బి.ఆర్.అంబెడ్కర్ సచివాలయం నుండి సహచర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి,రాష్ట్ర వ్యవసాయ శాఖా కార్యదర్శి రఘునందన్ రావు టి.ఎస్.ఎస్.పి.డి.సి.ఎల్  సి.యం.డి ముషారఫ్ తదితరులతో కలసి రాష్ట్రంలోని ఆయా జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్.పి లు, వ్యవసాయ శాఖాధికారులు ,విద్యుత్ శాఖాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రబీ సీజన్ పంట మరో 15 రోజుల్లో చేతికి రానున్నందున ఆయా జిల్లాల అధికారులు సమన్వయంతో కలసి క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ రైతాంగానికి తోడ్పాటు నందించాలని ఆయన సూచించారు. యాసంగి పంటకు సాగు నీరు చివరి ఆయకట్టు వరకు అందించేందుకు నీటిపారుదల శాఖాధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. 
- విద్యుత్ సరఫరాలో ఇప్పటి వరకు ఎటువంటి అవాంతరాలు లేవని అన్నారు. 
వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, క్షేత్ర స్థాయిలో నిజనిజాలు తెలుసుకోకుండా పంట నష్టం గురించి జరుగుతున్న ప్రచారం సత్య దూరమన్నారు. ఇటువంటి విషయంలో అధికారులు తక్షణమే రంగంలోకి దిగి నివారణ చర్యలు చేపట్టాలన్నారు
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశానుసారం రబీ పంట విషయంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూనే వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా సమగ్ర సమాచారం తెప్పిస్తున్నామన్నారు.
ఇందులో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, rdo వినోద్ కుమార్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Comments