ఘనంగా జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ కి వీడ్కోలు

Madupa Santhosh CEO


 ఘనంగా జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ కి వీడ్కోలుAdilabad: అక్షరతెలంగాణ : 

 - గజమాలలతో సత్కరించి, పోలీసు అధికారులు వాహనం లాగి వీడ్కోలు.
-  ఆనందం, దుఃఖం అన్ని భావాలతో జిల్లాను వీడుతున్నానని తెలిపిన జిల్లా ఎస్పీ. 
 - సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసిన జిల్లా ఎస్పీ.

బదిలీలు సర్వసాధారణమని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ తెలిపారు. జిల్లా హెడ్ క్వార్టర్స్ నందు బదిలీ అయిన ఎస్పీ గారికి విధాయి పరేడ్ నిర్వహించి పోలీసుల గౌరవ వందనాలు సమర్పించి, గజ మాలలతో సత్కరించి వాహనంలో జిల్లా ఎస్పీ గారిని హెడ్ క్వార్టర్స్ గేట్ వరకు జిల్లా పోలీసు అధికారులందరూ సిబ్బంది తో సహా ఏర్పాటు చేసిన తాడును లాగి సాదరంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో చేసిన సేవలు మరువలేనివని సిబ్బందిని విడి పోవడం బాధాకరమని తెలియజేశారు. 14 నెలలపాటు చేసిన సేవలు జిల్లా పోలీసుల తో తన అనుబంధాన్ని పంచుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా పోలీసు సిబ్బందికి మరియు డిపిఓ సిబ్బందికి పోలీసు అధికారులకు తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఆదిలాబాద్ జిల్లా నందు జిల్లా ఎస్పీ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి అసాంఘిక కార్యకలాపాలను రూపుమాపణంలో జిల్లాలో గంజాయి మరియు మాదకద్రవ్యాలను నిర్మూలనలో ప్రత్యేకంగా కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా శాంతి భద్రతల పరిరక్షణలో నిరంతరం కష్టపడుతూ పార్లమెంటు ఎన్నికలను మరియు గణపతి దుర్గాదేవి రంజాన్ పండుగలను ప్రశాంత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలను చోటు చేసుకోకుండా పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. విపత్తుల సమయంలో ఆపత్కాల సమయంలో జిల్లా స్థాయిలో మొదటిసారిగా 20 మంది పోలీసు సిబ్బందితో డిజాస్టర్ రెస్పాన్స్ ను స్థాపించి తనదైన ముద్రను ఆదిలాబాద్ జిల్లా లో ప్రారంభించారు. వరదలు, భూకంపాలు అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఎన్ డి ఆర్ ఎఫ్ మరియు ఎస్ డి ఆర్ ఎఫ్ వచ్చే సమయంలో జిల్లాలో సత్వరమే స్పందించి ప్రాణ నష్టం ఆస్తి నష్టం సంభవించకుండా ఈ డిడిఆర్ఎఫ్ బృందం పనిచేస్తుంది. అదేవిధంగా ఆదివాసీలకై ప్రత్యేకంగా మారుమూల గ్రామాలలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వైద్య సదుపాయాన్ని చేరువ చేశారు మరియు శీతాకాల సమయంలో నిరుపేదలైన ఆదివాసులకు రెండు వేల బ్లాంకెట్లను పంపిణీ చేసి సహాయపడటం జరిగింది. పోలీసులు మీకోసం లో భాగంగా ఆదివాసి యువత క్రీడా లలో మరియు చదువులో ఆసక్తిని పెంపొందించడానికి పుస్తకాలను మరియు స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేసి ప్రత్యేకంగా జిల్లా వ్యాప్తంగా వాలీబాల్ టోర్నమెంట్ను నిర్వహించి వారిలో ఉన్న క్రీడా స్ఫూర్తిని పెంపొందించారు. సిబ్బందితో నిరంతరం సమీక్ష సమావేశాలను ఏర్పాటు చేసి పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపడుతూ సిబ్బందికి మార్గదర్శనం చేస్తూ ఉన్నారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసిన సందర్భంగా జాతీయ ఎన్నికల సంఘం తరఫున వచ్చిన ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. సిబ్బందికి మునుపెన్నడూ లేనటువంటి సౌకర్యాలను కల్పిస్తూ సిబ్బంది పనితనాన్ని మెరుగుపరిచేలా తరదైన ముద్రను జిల్లాలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీలు ఎల్ జీవన్ రెడ్డి, పోతారం శ్రీనివాస్, సిహెచ్ నాగేందర్, హసీబుల్ల, సిఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు, పోలీసు సిబ్బంది, వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments