అదిలాబాద్ : అక్షరతెలంగాణ :
నార్నూర్ బ్లాక్ కు డెల్టా ర్యాంకింగ్ నిధుల క్రింద విద్య, ఆంగన్వాడీ , సమాజ అభివృద్ధి కార్యక్రమాల ప్రపోజల్ కు సంబంధించి శనివారం సంబంధిత అధికారులతో జిల్లా పాలనాధికారి రాజర్షి షా ఛాంబర్ లో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సంబంధిత శాఖల అధికారులతో విద్యా, మహిళా శిశుసంక్షేమశాఖ, ట్రైబల్, నీతి అయోగ్ కో ఆర్డినేటర్ లతో నార్నూర్ బ్లాక్‌కు డెల్టా ర్యాంకింగ్ నిధుల క్రింద విద్య, ఆంగన్వాడీ సమాజ అభివృద్ధి కోసం నిధులు మంజూరయ్యాయని వివిధ శాఖల కు సంబంధించి పనుల వివరాల ప్రపోజల్ మూడు రోజుల్లో సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. RO ప్లాంట్ ఏర్పాటు, ట్రైబల్ మ్యూజియం ఏర్పాటుకు స్థల సేకరణ, అంగన్వాడి కేంద్రాలలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు, ప్లే మెటీరియల్, ఔట్ డోర్ ప్లే మెటీరియల్, న్యూట్రిషన్ గార్డెన్, డిజిటల్ క్లాస్, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్, తదితర అంశాల పై ప్రపోజల్ సమర్పించుటకు సంబంధిత అధికారులతో వివరంగా చర్చించి , రెండు, మూడు రోజుల్లో ప్రతిపాదనలు పంపించాలని పేర్కొన్నారు.
ఈ సమావేశం లో సబ్ కలెక్టర్ యువరాజ్, ట్రైనీ కలెక్టర్ అభిగ్యాన్, తదితరులు పాల్గొన్నారు.
Comments