అక్రమ అరెస్టులు చేస్తే ఫారెస్ట్ అధికారులపై తిరుగుబాటు తప్పదు గోడంగణేష్-తుడుం దెబ్బ రాష్ట్ర కో కన్వీనర్
Adilabad: అక్షరతెలంగాణ :
-అన్యాయంగా అరెస్టు చేసిన వారిని వెంటనే బేసిరతుగా విడుదల చేయాలి లేకుంటే ఆసిఫాబాద్ ఫారెస్ట్ జిల్లా కార్యాలయం ముట్టడి చేస్తాం.
టైగర్ జొన్ పేరిట ఆదివాసి గ్రామాలను తరలించే కుట్రలు ఇకనైనా అపాలి లేకుంటే ఆదివాసుల ప్రతాపం ఫారెస్ట్ అధికారులు చూస్తారు
అదిలాబాద్ ,మావల కొమురం భీం కాలనీ లో సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా తుడుం దెబ్బ రాష్ట్ర కో కన్వీనర్ గోడం గణేష్ మాట్లాడుతూ ఫారెస్ట్ అధికారుల పై తీవ్రస్థాయిలో ధ్వమెత్తి హెచ్చరించిన రాష్ట్ర కో కన్వీనర్ గోడం గణేష్
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని రింగారిట్ గ్రామంలో గత వారం రోజుల కిందట అదే గ్రామానికి చెందిన గ్రామ పటేల్ కోవ జంగు, కోవ రాము లను చెట్లు నరికారు అనే నేపంతో అక్రమంగా అరెస్ట్ చేసిన అమాయక ఆదివాసిలను అటవీశాఖ అధికారులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బే శరత్తుగా వెంటనే విడుదల చేయాలి వారిపై పెట్టిన ఆక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలి అటవీ శాఖ అధికారుల ఆగడాలు మిన్నంటిపోతున్నాయని, అమాయక ఆదివాసులను టార్గెట్ చేసి, టైగర్ జోన్ ఓపెన్ క్యాస్టల పేరిట ఆదివాసి గ్రామాలను తరలించే కుట్ర చేస్తున్నారని అన్నారు, ఇటువంటి చర్యలకు పోతే అదివాసులు ఊరుకోరని అడవి నే నమ్ముకొని బతికే వాళ్ళు అడవి నాశనం చేసే పని ఎప్పుడు కూడా చేయరని కానీ కోవ రాము, కోవ జంగు అనే కోలం ఆదివాసుల ముమ్మాటికీ అక్రమ అరెస్టు అని అన్నారు, నిన్నటి రోజున తుడుందేబ్బ నాయకులు వెళ్లి సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి సందర్శించగా అక్కడ ఎటువంటి అడవిని చెట్లను నరికేసిన ఆనవాళ్లు కూడా లేవని కేవలం మేకల గొర్రెల కాపరులు కొట్టిన పొదల్లు ఉన్నాయని దానికి బిట్ మరియు సేక్షన్ అధికారులు DFO దగ్గర వెళ్ళి మాట్లాడి పంపుతామని మాయ మాటలు చెప్పి తీసుకెళ్ళి వారిని అన్యాయంగా అరెస్టు చేసుకొని జైలు కి పంపడం ఇది హేయమైన చర్యగా భావిస్తూ తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు, వారిని వెంటనే విడుదల చేయకుంటే మాత్రం అతి త్వరలోనే జిల్లా అటవీ శాఖ కార్యాలయాన్ని ఆదివాసి ప్రజలతో ముట్టడి చేస్తామని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో
తుడుం దెబ్బ రాష్ట్ర కోకన్వీనర్ గోడం గణేష్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెట్టి మనోజ్ గోడం రేణుక ఆదివాసి మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు ఉయిక ఇందిర ఆదివాసి మహిళా సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు సోయం లలిత అదిలాబాద్ డివిజన్ కమిటీ అధ్యక్షురాలు పుష్నక్ నాగరావ్ గెడం గణేష్ గేడం అనంద రావు,వెట్టి పార్వతి బాయ్ మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
Comments