సైబర్ నేరాలకు పాల్పడాలనే భారీ కుట్రను భగ్నం చేసిన ఆదిలాబాద్ జిల్లా పోలీసులు
సైబర్ నేరాలు చేయడానికి పెద్ద ఎత్తున మొబైల్ ఫోన్లు సేకరించిన ఆరుగురుపై కేసు నమోదు, ఐదుగురు అంతరాష్ట్ర సైబర్ నేరస్తుల అరెస్ట్.
- 2125 పాత మొబైల్ ఫోన్లు, 107 సిమ్ కార్డులు, ఐదు బీహార్ కి చెందిన బైక్స్, 600 మొబైల్ బ్యాటరీలు స్వాధీనం.
- పత్రికా సమావేశంలో వివరాలక్నుఛేదించిన వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్.
సైబర్ నేరాలను చేయాలని పథకం వేసిన ఘరానా ముఠాను ఆదిలాబాద్ రెండవ పట్టణ మరియు సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. ఈ సందర్భంగా అదిలాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమావేశం మందిరం నందు జిల్లా ఎస్పీ శ్రీ అఖిల్ మహజాన్ IPS మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
బీహార్ రాష్ట్రానికి చెందిన ఆరుగురు నిందితులు ముఠాగా ఏర్పడి దేశవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడడానికి వేసుకున్న ప్లాన్ లో భాగంగా A1.Thabaraq గ్యాంగ్ లీడర్ గా ఉంటూ మిగిలిన ఐదుగురు నిందితులను బీహార్ రాష్ట్రం నుండి ఐదు బైకులతో పాటు తెలంగాణ రాష్ట్రానికి పంపి ద్విచక్ర వాహనాలలోతిరుగుతూ పాత మొబైల్ Phones తీసుకొని ప్లాస్టిక్ డబ్బాలను ఇస్తామంటూ తిరుగుతూ ఊర్లలో పట్టణాలలో ఉన్న పాత మొబైల్ ఫోన్ లను, సిమ్ కార్డులు మరియు బ్యాటరీలను సేకరించడం జరుగుతుందని వాటిలో లభ్యమైన సిమ్ కార్డుల ద్వారా, ఫోన్ల ద్వారా వివిధ రాష్ట్రాలలోని ప్రజలకు బ్యాంక్ అధికారులు అంటూ ఫోన్లు చేసి వారిని సైబర్ నేరం బారిన పడేవిధంగా చేసి డబ్బులు సంపాదించే ఒక ముఠా యొక్క కుట్రను భగ్నం చేశామని జిల్లా ఎస్పీ తెలిపారు ఈ సందర్భంగా వీరి వద్ద నుండి దాదాపు 2125 పాత మొబైల్ ఫోన్ లను, 107 సిమ్ కార్డులను వీరు ప్లాస్టిక్ డబ్బాలను అమ్మడానికి Trayలో అమర్చి ఉన్న ఐదు ద్విచక్ర వాహనాలను మరియు వీరు వినియోగించే ఐదు మొబైల్ ఫోన్లను, 600 మొబైల్ బ్యాటరీలను వీరి వద్ద నుండి స్వాధీనం చేసుకొని ఆదిలాబాద్ రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయబడిందని తెలిపారు ముఖ్యంగా వీరు ఇదివరకే కర్ణాటక రాష్ట్రం నుంచి దాదాపు పది నుండి 12 వేల వరకు మొబైల్ ఫోన్లను సేకరించి వాటి ద్వారా వివిధ సైబర్ నేరాలకు పాల్పడడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు. వీరి కుట్ర విధానం ఏమనగా ప్రజల నుండి సేకరించిన మొబైల్ ఫోన్లను వాటి సిమ్ కార్డులను వాడి అమాయక ప్రజలను మోసం చేసి ఈ ముఠా సభ్యులు పోలీసులకు చిక్కకుండా వుండాలనే దురుద్దేశంతో పక్క ఒక గ్యాంగ్ గా ఏర్పడి ఈ కుట్రలను పాల్పడడం, అదేవిధంగా ఈ మొబైల్ ఫోన్లో సిమ్ కార్డులు అమాయక ప్రజల పేరుపై ఉండడంతో తమపై అనుమానం రాదు మరియు సులువుగా చట్టం నుంచి తప్పించుకోవాలని దురుద్దేశంతో ఇలాంటి నేరాలు చేస్తారని తెలిపారు. దేశవ్యాప్తంగా భారీ ఎత్తున సైబర్ నేరాలకు పాల్పడాలనే ఉద్దేశంతో ఈరోజు అరెస్టు అయిన A2 to A6 పెద్ద ఎత్తున సెల్ ఫోన్లు, సిమ్ కార్డులు సేకరించి బీహార్ కు తీసుకెళ్లి A1.Thabaraq కు అప్పగించడం జరుగుతుంది. సేకరించిన ఈ సెల్ ఫోన్లు మరియు సిమ్ కార్డుల ద్వారా A1.Thabaraq మరియు అతని అనుచరులు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు బ్యాంకు అధికారులమని నమ్మించి లేదా ఉద్యోగాలు ఇప్పిస్తామని మరియు లాటరీ గెలిచారని ఫోన్ చేస్తూ వివిధ రకాలుగా నమ్మిస్తూ మోసం చేస్తూ ఓటిపి తెలుసుకొని అమాయక ప్రజల యొక్క బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బులను మళ్లించుకోవడం జరుగుతుంది ఈరోజు స్వాధీనం చేసుకున్న ఫోన్ల ద్వారా ఎంతో మంది అమాయక ప్రజలను మోసగించాలని కుట్రపన్నడం జరిగింది. సైబర్ నేరస్తుల ఈ కుట్రను చాకచక్యంగా కనుక్కొని వారిని అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ డీఎస్పీ హసీబుల్ల, ఎస్డిపిఒ అదిలాబాద్. ఎల్ జీవన్ రెడ్డి , 2 టౌన్ ఇన్స్పెక్టర్ సిహెచ్.కరుణాకర్ రావ్, CCS ఇంస్పెక్టర్ చంద్ర శేఖర్ మరియు వారి యొక్క సిబ్బందిని అభినందించుచున్నాను.
Comments