- నూతన ఆలోచనలు, నూతన విధానాలతో జిల్లా పోలీసుల కార్యచరణ.
- నూతన పద్ధతులతో పోలీసులను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కృషి.
- సరిహద్దు నందు అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా మరింత కట్టుదిట్టం.
Adilabad: అక్షరతెలంగాణ :
అదిలాబాద్ జిల్లా కేంద్రం లోని స్థానిక పోలీసు ముఖ్య కార్యాలయం నందు సోమవారం ఆదిలాబాద్ జిల్లాకు నూతనంగా విచ్చేసిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ బాధ్యతలను స్వీకరించడం జరిగింది. మొదటగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి, ప్రస్తుత కరీంనగర్ సిపి గౌస్ ఆలం వద్ద నుండి ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఉన్నందున సరిహద్దు పై ప్రత్యేక దృష్టి సారించి ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా కట్టడి చేస్తామని తెలియజేశారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా క్రిమినల్ యాక్టివిటీస్ లేకుండా నేరాలను నియంత్రించడం, శాంతి భద్రతల పరిరక్షణ ప్రధాన ధ్యేయం అని తెలిపారు. జిల్లాలో గంజాయి మరియు మాదకద్రవ్యాల పై ప్రత్యేక దృష్టి సారించి గంజాయి పండించడం వాడకం లాంటి వాటిని మరింత పటిష్టంగా నియంత్రిష్టమైన తెలిపారు. రౌడీలు గ్యాంగ్స్టర్లు లేకుండా హిస్టరీ షీట్లను ఏర్పాటు చేసి ప్రతిరోజు వారిని పర్యవేక్షిస్తూ నియంత్రిస్తామని తెలియజేశారు. పటంలోని ట్రాఫిక్ సమస్యపై మరియు జిల్లాలో ఎలాంటి సంఘవిద్రవశక్తుల సమస్యలు తలెత్తకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తామని తెలియజేశారు. ప్రజలు పోలీసులు మీడియా మిత్రులు అందరూ కలిసికట్టుగా ఆదిలాబాద్ జిల్లా ఉన్నత స్థానానికి ఎదిగేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి బి సురేందర్రావు, డీఎస్పీలు పోతారం శ్రీనివాస్, ఎల్ జీవన్ రెడ్డి, సిహెచ్ నాగేందర్, హసీబుల్లా, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు సిబ్బంది తదితరులు జిల్లా ఎస్పీకి ఘనంగా స్వాగతం పలికి ఆహ్వానించారు.
Comments