అవుట్ పేషెంట్ డిస్పెన్సరీ యూనిట్ ను ప్రారంభించిన హైకోర్ట్ జడ్జి జస్టిస్ రేణుకా యారా

Madupa Santhosh CEO
అవుట్ పేషెంట్ డిస్పెన్సరీ యూనిట్ ను ప్రారంభించిన హైకోర్ట్ జడ్జి జస్టిస్ రేణుకా యారా
అదిలాబాద్ అక్షరతెలంగాణ :
హైకోర్ట్ జడ్జి జస్టిస్ రేణుకా యారా అదిలాబాదు విచ్చేసిన.  సందర్భంగా  స్థానిక పెన్ గంగా గెస్ట్ హౌస్ లో పూలమొక్కలు అందించి స్వాగతం పలికిన  జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర రావు, జిల్లా పాలనాధికారి రాజర్షి షా, జిల్లా ఎస్పి గౌస్ ఆలం.
అనంతరం తెలంగాణ హై కోర్ట్ న్యాయమూర్తి శ్రీమతి. జస్టిస్ రేణుక యారా  జిల్లా కోర్ట్ ప్రాంగణం నందు అవుట్ పేషెంట్ డిస్పెన్సరీని ప్రారంభించడం జరిగింది.
ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథి గా హాజరైన తెలంగాణ హై కోర్ట్ న్యాయమూర్తి శ్రీమతి. జస్టిస్ రేణుక యారా  మాట్లాడుతూ  అవుట్ పేషెంట్ డిస్పెన్సరీ సదుపాయాన్ని కోర్ట్ ప్రాంగణం లోని న్యాయ సిబ్బంది , కోర్ట్ కి వచ్చే కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆన్నారు.
 ప్రారంభోత్సవ కార్యక్రమం లో  జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ శ్రీమతి సౌజన్య ,రిమ్స్ డైరెక్టర్ డా. రాథోడ్ జైసింగ్ , ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏంరాల నగేష్ , డిప్యూటీ జిల్లా వైద్య  ఆరోగ్య శాఖా అధికారి శ్రీమతి డా. సాధన , డా. మిట్రపెల్లి శ్రీధర్ ,  డిస్పెన్సరీ మెడికల్ ఆఫీసర్ డా.భూమయ్య , తదితరులు పాల్గొన్నారు.
Comments