అక్రమంగా నిల్వ ఉంచిన 32 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్న విజిలెన్స్ అధికారులు : సంగారెడ్డి జిల్లా: అక్షరతెలంగాణ :
నారాయణఖేడ్ పట్టణంలోని ఓ దుకాణంలో అక్రమంగా నిల్వ ఉంచిన 32 క్వింటాళ్ల పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (పీడీఎస్) బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు సోమవారం పట్టుకున్నారు.
విజిలెన్స్ డీఎస్పీ వెంకటేశ్వర్లు నేతృత్వంలో నిర్వహించిన తనిఖీల్లో ఈ అక్రమ నిల్వ బయటపడింది. ప్రభుత్వ సబ్సిడీ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసి వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం రావడంతో అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిరుపేదల కోసం ఉచితంగా బియ్యం సరఫరా చేస్తుంటే కొంతమంది దళారులు నిరుపేదల ప్రజల సొమ్మును దోచేస్తున్నారు. ఇంకా ఎవరైనా అక్రమంగా నిల్వ చేసుకొని ఉంచితే మాకు సమాచారం ఇస్తే వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రభుత్వ బియ్యాన్ని అనధికారికంగా విక్రయించే వ్యక్తులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ ఎస్సై పండరీ, వెంకటేశ్వర్లు, రిటైర్డ్ తాసిల్దార్ ప్రభాకర్, స్థానిక రెవెన్యూ ఇన్స్పెక్టర్ మాధవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Comments