Union Budget (యూనియన్ బడ్జెట్)2025:
మెడికల్ /ఐ ఐ టి సీట్లను భారీగా పెంచిన-ఆర్థికమంత్రి కీలక ప్రకటన.చేసారు.
ఏఐకి (AI)పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో దేశవ్యాప్తంగా మూడు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాల్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అలాగే ఐఐటీలు, మెడికల్ కాలేజీల్ని బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఐఐటీలను విస్తరించనున్నట్లు తెలిపారు. 2014 తర్వాత ప్రారంభించిన ఐదు ఐఐటీల్లో మరో 6500 మంది విద్యార్థులకు విద్యను అందించడానికి అదనపు మౌలిక సదుపాయాలు అందిస్తామని తెలిపారు. ఇందులో ఐఐటీ పాట్నాలో హాస్టల్, మౌలిక సదుపాయాలను విస్తరించనున్నట్లు ఆర్ధిక మంత్రి పేర్కొన్నారు.
వైద్యరంగంలో మౌలిక సదుపాయాల్ని పటిష్టం చేసేందుకు వీలుగా వచ్చే ఐదేళ్లలో 75 వేల సీట్లు పెంచబోతున్నట్లు తెలిపారు.
వచ్చే ఏడాదిలోనే మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల్లో 10వేల అదనపు సీట్లు అందుబాటులోకి తెస్తామన్నారు.
Comments