"డిజిటల్" తరగతి గదులను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా

Madupa Santhosh CEO
డిజిటల్ క్లాసుల రూమ్ లను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ రాజర్షి షా 
అదిలాబాద్ : అక్షరతెలంగాణ : 
జిల్లా కలెక్టర్  రాజర్షి షా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల  తాడిహత్నూర్‌ ని సందర్శించి, BAIF NGO సంస్థ ద్వారా నిధులు సమకూర్చిన డిజిటల్ క్లాస్ రూమ్, వాటర్ ఫిల్టర్ యూనిట్ , లైబ్రరీని  శుక్రవారం ప్రారంభించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాసుల విద్యాబోధన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా  అన్నారు. శుక్రవారం నార్నూ ర్ మండలం తాడిహత్నూర్ జిల్లా పరిషత్ ప్రాధమిక ఉన్నత పాఠశాల లో డిజిటల్ క్లాసులను ప్రారంభించారు. డిజిటల్ క్లాస్ రూమ్ సదుపాయాలను ఉపాధ్యాయులు, విద్యార్థులు పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని  సూచించారు.
 హెచ్.డి.ఎఫ్.సి బ్యాంక్ వారి ఆర్థిక సహాయంతో  సీఎస్ఆర్ నిధులతో మారుమూల ప్రాంతాల్లో విద్యార్థులకు ఆధునిక విద్య అందించే దిశగా ముందుకు వెళుతుందని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఏర్పాటు చేస్తున్న వసతులను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని,విద్య పై అధిక శ్రద్ద వహిస్తూ విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందించాలని ఆన్నారు.
అనంతరం నిర్మాణం లో ఉన్న పనులను పరిశీలించారు ఇందులో ప్రధానోపాధ్యాయులు మనోహర్, ఉపాద్యాయులు, విద్యార్ధులు, తదితరులు పాల్గొన్నారు.
Comments