"ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలను" పకడ్బందీగా నిర్వహించాలి " వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గోన్న జిల్లా కలెక్టర్, ఎస్పి:

Madupa Santhosh CEO
"ఇంటర్మీడియెట్ వార్షిక  పరీక్షలను  పకడ్బందీగా నిర్వహించాలి " వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గోన్న జిల్లా కలెక్టర్, ఎస్పి: ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణ, ఎల్ ఆర్ ఎస్  రా ష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా పాలనాధికారి రాజర్షి షా, జిల్లా ఎస్పి గౌస్ ఆలం,అదనపు కలెక్టర్ శ్యామలా దేవి, సంబంధిత అధికారులు.
ఈ సందర్భంగా ఆన్ని జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మాట్లాడుతూ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పకడ్బందీగా  నిర్వహించాలని  ఆన్నారు.
వచ్చే నెల మార్చి 5వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఇంటర్ వార్షిక పరీక్షల ఏర్పాట్ల పై సమీక్షిస్తూ ఎలాంటి పొరపాట్లకు, కాపీయింగ్ కు  తావులేకుండా ప్రశాంత వాతావరణంలో సాఫీగా పరీక్షలను నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలన్నారు. పరీక్షా కేంద్రాలలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ ఫోన్లను అనుమతించకూడదని, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు, ఇన్విజిలేటర్ లతో పాటు కేంద్రాలను తనిఖీ చేసేందుకు వెళ్లే అధికారులు సైతం సెల్ ఫోన్ లు తీసుకెళ్లకూడదని ఆదేశించారు. ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తరువాతనే లోనికి అనుమతించాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ, గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయాలని అన్నారు. 
అనంతరం కలెక్టర్   పరీక్షల నిర్వహణ పై వివిధ శాఖల అధికారులకు కీలక సూచనలు చేశారు. పరీక్షా కేంద్రాలకు ప్రశ్నాపత్రాలు తీసుకురావడం మొదలుకుని, పరీక్షలు ముగిసిన మీదట ఆన్సర్ షీట్లను నిర్ణీత పాయింట్ కు తరలించేంతవరకు ఎంతో జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రతి కేంద్రంలోనూ పరీక్షల నిర్వహణ తీరును చీఫ్ సూపరింటెండెంట్ లు నిశితంగా పర్యవేక్షించాలని ఆదేశించారు.పరీక్ష కేంద్రాలలో   తాగునీటి వసతి, సరిపడా ఫర్నీచర్, విద్యుత్ సౌకర్యం, టాయిలెట్స్ వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో  ఉండాలని,  పరీక్షా సమయాల కనుగుణంగా రవాణా సదుపాయం అందుబాటులో ఉండేలా బస్సులు నడిపించాలని , పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్ లను మూసి వేయించాలని, 144 సెక్షన్ అమలు చేయాలని, గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. కాపీయింగ్ కు ఆస్కారం లేకుండా సిట్టింగ్ స్క్వాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల ద్వార కట్టుదిట్టమైన పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ సూచించారు.
 వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ శ్యామలా దేవి, సబ్ కలెక్టర్  యువరాజ్, ట్రైనీ కలెక్టర్ అభిగ్యాన్,  ఆర్డీఓ వినోద్ కుమార్, SC ట్రాన్స్కో, ప్రిన్సిపల్, dlpo,, డీఎంహెచ్ఓ , కలెక్టరేట్ AO,  తదితరులు పాల్గొన్నారు.
Comments