అక్షరతెలంగాణ / నేషనల్ న్యూస్ :
మాజీ ప్రధాని రిషి సునాక్ బ్రిటన్ (భారతీయ సంతతి)
జైపుర్ లోని ఐకానిక్ హోటల్ క్లార్క్స్ అమెర్ లో
గురువారం లిటరేచర్ ఫెస్టివల్ ప్రారంభమైంది.
ఇందులో భాగంగా పలువురు రాజకీయ, సినీ,
సాహిత్య ప్రముఖుల ప్రసంగాలు ఏర్పాటు చేశారు.
300మందికి పైగా ప్రముఖులుహాజరవ్వగా వారిలో రిషి సునాక్ ఉన్నారు.
ఇన్ఫోసిస్ infocis సహవ్యవస్థాపకుడు
నారాయణమూర్తి ఆయన
సతీమణి సుధామూర్తి, వారి కుమార్తె, అక్షతా
మూర్తి, యూఎస్ దౌత్యవేత్త ఎరిక్ గార్సెట్టివారు హాజరయ్యారు.
వివిధసమస్యలపై ఆలోచనాత్మక చర్చల్లో పాల్గొన్నారు.
సుధామూర్తి మై మదర్, మై సెల్ఫ్ అనే సెషన్
ను నిర్వహించారు.
లిటరేషన్ ఫెస్ట్ లో ఓ ఆసక్తికర సన్నివేశం జరిగింది. రిషి సునాక్ కూర్చొని హాజరయిన వారికి అభివాదం చేస్తుండగా సుధామూర్తి సోదరి సునందా కులకర్ణి ఆయనను వారించి పైకి లేచి వారందరికి నమస్కారం చేయాలని సూచించారు. వెంటనే రిషి లేచి నిలబడి నమస్కారం చేశారు. ఆ తర్వాత అందరూ సరదా నవ్వుకున్నారు. ఈ వీడియో కాస్త వైరల్ గామారింది. ఇకపోతే, భారత సంతతికి చెందిన బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్ (Rishi Sunaak) బ్రిటన్ ప్రధానిగా ఎన్నికై ఆ పదవి చేపట్టిన తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. అయితే వలసల కట్టడి, ఇతర అంశాల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలపై సొంత పార్టీ నేతల నుంచి విమర్శలు వచ్చాయి. దీంతో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష లేబర్ పార్టీ ఘన విజయం సాధించడంతో సునాక్ ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు.
Comments