అదిలాబాద్ : అక్షరతెలంగాణ
రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి గ్రాడ్యుయేట్ , టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలపై హైదరాబాద్ నుండి శనివారం ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ లతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉపాధ్యాయులకు సంబంధించి 32 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళి నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు.
ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలతో కూడిన పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో పట్టభద్రులకు సంబంధించి 18 మండలాలలోని 32 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి 16417 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి కట్టుదిట్టంగా అమలయ్యేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. . సంబంధిత అధికారులకు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై కీలక సూచనలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాను తప్పిదాలకు తావులేకుండా పక్కాగా రూపొందించాలని ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న టీచర్స్, పట్టభద్రుల ఓటరు దరఖాస్తులను పరిశీలించి ఈ నెల 7 వ తేదీలోగా పరిష్కరించాలని , పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అవసరమైన అన్ని వసతులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని, ఫిబ్రవరి 27 న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగే పోలింగ్ ప్రశాంత వాతావరణంలో, పూర్తి పారదర్శకంగా జరిగేలా ఏర్పాట్లు చేసుకోవాలని, ఎన్నికల సిబ్బందిని నియమిస్తూ, వారికి శిక్షణ అందించేందుకు మాస్టర్ ట్రైనర్లను గుర్తించాలని సూచించారు.
Comments