పుష్యమాసం ఆదివాసులకు అత్యంత పవిత్రమైనది ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఖానాపూర్

Madupa Santhosh CEO
పుష్యమాసం ఆదివాసులకు అత్యంత పవిత్రమైనది 
ఖానాపూర్ ఎమ్మెల్యే  వెడ్మ బొజ్జు పటేల్ 

అదిలాబాద్ : కేరామెరి : అక్షర తెలంగాణ : జనవరి28 : 
పుష్య మాసం అత్యంత పవిత్రమైనదని,ఆదివాసులు ఎంతో నియమనిష్టలతో నెలరోజుల పాటు భక్తి శ్రద్ధలతో పెర్సాపెన్ లను పూజిస్తారని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంగళవారం కేరామేరి మండలంలోని పెద్ద కరంజీవాడ గ్రామంలో పుష్య అమావాస్య సందర్భంగా ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలసి నాగోబా ఆలయంలో సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు.ముందుగా గ్రామస్తులు ఎమ్మెల్యేను సంప్రదాయ డోలు వాయిద్యాల మధ్య ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో ముచ్చటించారు.అనంతరం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ. ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు ఇతరుల కంటే భిన్నంగా ఉంటాయని, ప్రకృతినే దైవంగా భావించి పూజలు చేయడం తరతరాలుగా వస్తున్న ఆచారమని పేర్కొన్నారు.   నేటి యువత సంస్కృతి సంప్రదాయాలను మరిచి,కొత్త సంస్కృతిని అవలంబించడం సరైనది కాదని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ,భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జైనూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మేత విశ్వనాథ్ రావు, మార్లవాయి సార్మెడి జుగ్నక్ దేవురావు,మార్కెట్ కమిటీ డైరెక్టర్ పంద్రం శేకు, గ్రామ పటేల్ కుమ్ర భీంరావు,పెద్దలు మెస్రం అంబాజీ, వివిధ గ్రామాల పటేళ్లు, సార్మేడిలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
Comments