- ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతర లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
అదిలాబాద్ : ఉట్నూర్: అక్షర తెలంగాణ: ప్రతినిధి : జనవరి 30
తెలంగాణలో జరిగే ఈ ఆదివాసీ సంబురం తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరగా పేరొంది, సుదూర ప్రాంతాల నుండి భక్తులు తరలివచ్చి ఈ వేడుకలను తిలకించారు
ఈ సందర్భంగా మార్లవాయి జైనూర్ మండలం నుండి గుస్సాడి డ్యాన్స్,కొలాం డ్యాన్స్ గుడిహాత్నూర్ గోండి దింసా కోహినూర్ఆంధ్ కమ్యూనిటీ, ఇంద్రవెల్లిపర్ధాన్ కమ్యూనిటీ డ్యాన్స్ తోటి,తోషంనాయక్ పొడ్ పరార్ ఫౌండేషన్ హైదారాబాద్ నుండి వృక్ష సంపద పర్యావరణ పరిరక్షణ ల పై కళాకారులు ప్రదర్శన, నృత్యాలు చూపరులను విశేషంగా అలరించాయి.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఉదయం ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు.ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ యువరాజ్, ట్రైనీ కలెక్టర్ అభి గ్యాన్, ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేష్ ధోత్రే దంపతులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు, జిల్లా అధికారులు, తదితరులు ఉన్నారు.
Comments