జవహర్ నవోదయ విద్యాలయం ఏర్పాటుకు కృషి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్

Madupa Santhosh CEO
జగిత్యాల:అక్షరతెలంగాణ : ప్రతినిధి: జనవరి 28:
ధర్మపురి  మండలం  నేరెళ్ల గ్రామంలో జవహర్ నవోదయ పాఠశాల స్థాపనకు సంబంధించి తదుపరి మార్గదర్శకాలు మరియు చర్యలు తీసుకోవాలని అదే విధంగా ధర్మపురి గోదావరిలో మురుగు నీరు కలవకుండా కవరెజీ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వ పాలన అనుమతులు ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్లో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి కి మంగళవారం రోజున రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు తో కలిసి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్  వినతి పత్రాన్ని అందజేశారు.
-ఈ సందర్భంగా ధర్మపురి పుణ్య క్షేత్రం అనేది వేద పండితులకు అర్చకులకు నిలయమని ఇక్కడ విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుందని,విద్యార్థులకు మంచి భవిష్యత్తును ఇవ్వాలనే నిబద్ధతకు అనుగుణంగా మా ప్రాంతంలో ప్రత్యేకంగా జవహర్ నవోదయ పాఠశాలను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి లేఖను పంపించడం జరిగిందని,దీని నేపథ్యంలో జవహర్ నవోదయ పాఠశాలను జగిత్యాలకు మంజూరైనట్లు ఆదేశాలు రావడం జరిగింది.
Comments