బాసర ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో ఫిబ్రవరి 2న వసంత పంచమి ఉత్సవాలు జరగనున్న నేపథ్యంలో స్ధానిక శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ ప్రత్యేక దృష్టి సారించారు. 'వసంత పంచమి' సందర్భంగా అమ్మవారి జన్మదినానికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. రెవెన్యూ, పోలీస్, పంచాయతీ సిబ్బంది సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆలయ అధికారులకు, సిబ్బందికి కోరారు.,
Comments