కాలని మౌలిక వసతుల కల్పన కు తమవంతు కృషి చేస్తాను - బిజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్

Madupa Santhosh CEO
అదిలాబాద్ : మావల: అక్షర తెలంగాణ / జనవరి  29 : అదిలాబాద్  మున్సిపాలిటీలో వీలినమైన కాలనీ లలో మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్  పేర్కొన్నారు. పట్టణంలోని సర్వే నంబర్ 170 కాలనీ. టీచర్స్ కాలనీలో  కొనసాగుతున్న అభివృద్ధి పనులను బుధవారం ఎమ్మెల్యే  పరిశీలించి మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి పనులు కాలనీలో కొనసాగుతున్న అన్నారు. ఇటీవల మున్సిపాలిటీలో వీలినమైన కాలనీలో మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పలుమార్లు కాలనీవాసులు తమ దృష్టికి తీసుకోవచ్చారన్నారు. కోటి 60 లక్షలు ఆదిలాబాద్ మున్సిపాలిటీ నిధులతో.. ప్రత్యేకంగా వీలిన కాలనీలా అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు కార్యక్రమంలో అధికారులు పట్టణ బిజెపి కార్యకర్తలు , నాయకులు , యువకులు , కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు..
Comments