ఆదిలాబాద్ జిల్లా,జనవరి 28
గిరిజన జాతర - నాగోబా జాతరకు పట్టిష్ట బందోబస్తు - జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్.
-600 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు.
-100 సీసీటీవీ కెమెరాలతో ప్రత్యేక నిఘా
-గిరిజనుల సంప్రదాయాలను గౌరవించాలి,ప్రజలతో నిదానంగా నడుచుకోవాలి
-ఆరు సెక్టర్లుగా విభజన, మూడు షిఫ్టుల్లో విధులు.
-బందోబస్తుకు వచ్చిన సిబ్బందికి వివిధ నిత్యవసర వస్తువులతో కూడిన కిట్ అందజేత.
-సిబ్బందికి ఏర్పాటు చేసిన వసతి, భోజన శాల ను పరిశీలించిన జిల్లా ఎస్పీ.
అదిలాబాద్ : అక్షర తెలంగాణ : ప్రతినిధి : (ఉత్నూర్ ) అతిపెద్ద గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో జరిగే నాగోబా జాతరకు పోలీస్ శాఖ పూర్తి సంసిద్ధతతో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసిందని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ తెలిపారు. సోమవారం సాయంత్రం స్థానిక నాగోబా దర్బార్ హాల్ నందు నిర్వహించిన సమావేశంలో జిల్లా ఎస్పీ పాల్గొని సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. గిరిజనులు మిశ్రమంషీయులు సాంప్రదాయాలు నడుము పండగను జాతరను నిర్వహిస్తారని వారి సాంప్రదాయాలను గౌరవిస్తూ నడుచుకోవాలని సిబ్బందికి సూచించారు. జాతర బందోబస్తుకు విచ్చేసిన సిబ్బందికి నిత్యవసర వస్తువులతో కూడిన ఒక ప్రత్యేక కిట్టును సిబ్బంది ప్రతి ఒక్కరికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సిబ్బంది ప్రజల పట్ల నిదానంగా సత్ప్రవర్తతతో వ్యవహరించాలని తెలిపారు.ఈ జాతర జనవరి 28వ తారీకు రాత్రి గంగాభిషేకం, మహా పూజతో ప్రారంభమై ఫిబ్రవరి 4వ తారీకు వరకు నిర్వహించబడుతుందని తెలిపారు. జాతర మొత్తాన్ని ఆరు సెక్టార్లుగా విభజించి బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగిందని, తమకు కేటాయించిన స్థలాలలో మూడు షిఫ్టుల నందు సిబ్బంది ఎల్లవేళలా హాజరుతో ఉంటూ విధులను నిర్వర్తించాలని సూచించారు. జాతర మొత్తాన్ని ఒక డ్రోన్ కెమెరా, 100 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ ల ద్వారా 24 గంటలు పర్యవేక్షణ నిర్వహించబడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ విధులను నిర్వర్తించే సమయంలో గుర్తింపు కార్డులను ధరించాలని సూచించారు. కేటాయించిన విధులను పర్యవేక్షించేందుకు మూడు ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని. ముఖ్యమైన రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలను పోలీస్ పీకెట్లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కేటాయించిన విధులలో నిర్లక్ష్యం వహించినట్లయితే శాఖ పరమైన చర్యలు తప్పవని తెలియజేశారు. ఎటువంటి అత్యవసర పరిస్థితిలోనైనా హెల్ప్ డెస్క్ లేదా రిసెప్షన్ సెంటర్లను సంప్రదించాలని సూచించారు. జాతర నందు ఎటువంటి మద్యానికి, మాంసాహారానికి అనుమతులు లేదని, ఎవరైనా మద్యం అమ్మడానికి చూస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సిబ్బంది ప్రతి ఒక్కరికి పాయింట్ బుక్ లను అందజేయడం జరిగిందని, . జాతరకు విచ్చేసిన కొమరం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల్, ఆదిలాబాద్ జిల్లా పోలీసులకు ప్రత్యేకంగా సిబ్బందికి కావలసిన కనీస అవసరాలతో కూడిన కిట్టును అందజేయడం జరిగింది. జాతర సమయంలో బైక్ పెట్రోలింగ్, ఫుట్ పెట్రోలింగ్, షీ టీం, పార్కింగ్, ఎగ్జిబిషన్, బందోబస్తు, మఫ్టీ పార్టీలో, పోలీసులు విధులను నిర్వర్తిస్తుంటారని తెలిపారు. సిసిఎస్ స్పెషల్ బ్రాంచ్ సిబ్బందితో ప్రత్యేకంగా నిఘాను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అత్యవసర సమయాలలో అగ్నిమాపక వాహనాన్ని, మరియు ఆంబులెన్స వాహనాలకు అన్ని ప్రదేశాలకు వచ్చే విధంగా సిబ్బంది రోడ్డుపై అప్రమత్తమే విధులు నిర్వహించాలని సూచించారు. సిబ్బందికి ఏర్పాటు చేసిన వసతి, మరియు భోజన శాల ను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పీ కాజల్ సింగ్ ఐపీఎస్, డిఎస్పి లు సిహెచ్ నాగేందర్, పోతారం శ్రీనివాస్, ఉట్నూర్ సిఐ జి మొగిలి, నార్నూర్ సీఐ రహీం పాషా, సిసిఎస్ సీఐ చంద్రశేఖర్ ఎస్సై డి సునీల్, మనోహర్, శ్రీకాంత్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments